• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కు దారి దొరికింది: చిరు

By Staff
|

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఆవేశానికి దారి దొరికిందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ లో సామాజిక అన్యాయాలను చూసి వెలిబుచ్చే ధర్మావేశమని, తమ పార్టీ యువరాజ్యం సారథ్య బాధ్యతలు స్వీకరించడంతో పవన్ ఆవేశానికి దారి దొరికిందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం విలక్షణమైందని ఆయన అన్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించిన తమ్ముళ్లలో పవన్ కళ్యాణ్ ఒక తమ్ముడని ఆయన అన్నారు. యువరాజ్యం సారధ్యానికి పవన్ కళ్యాణ్ సమర్థుడని ఆయన అన్నారు. అల్లు అరవింద్ తనకు బంధువు కన్నా మంచి మిత్రుడని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయబోరని, సినిమా వృత్తిని కొనసాగిస్తారని ఆయన అన్నారు.

ఒంటరిగా పోటీ చేసి చరిత్రను పునరావృతం చేయాలని తనకు లేదని ఆయన చెప్పారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రయోజనం చేకూరుతుందని భావిస్తే ఎవరితోనైనా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. తెరాస నాయకుడు హరీష్ రావుతో అల్లు అరవింద్ మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. పార్టీ జిల్లా కమిటీల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X