• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్, బాబులతో చిరు కరచాలనం

By Staff
|

హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఆదివారంనాడు కరచాలనం చేశారు. వీరంతా ఒకే వేదిక మీదికి వచ్చారు. వీరితో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా వచ్చారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన సూర్య దినపత్రిక వార్షికోత్సవ సభకు వీరంతా హాజరయ్యారు. ఈ పార్టీ నాయకుల ప్రసంగాల్లో సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండా అయింది.

సామాజిన న్యాయ సాధనలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని సూర్య పత్రిక ప్రతిరోజూ ఉదయమే తలుపు తట్టి గుర్తు చేస్తోందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. సామాజిక న్యాయ సాధనకు అద్యుడు ఎన్టీ రామారావు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రం నుంచి ఏడుగురు కేంద్ర మంత్రులుంటే ఒక్కరు కూడా బిసి నాయకుడు లేరని ఆయన అన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు బిసిలకు ఇస్తామని చెప్పామని, వరంగల్ లో బిసి గర్జన పెట్టామని, ఆ తర్వాతే కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావు బిసిల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సామాజిక న్యాయ సాధన చాలా కష్టమైన పని అని, ఈ సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని చిరంజీవి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X