• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేవుడు కరుణిస్తే తెలంగాణ: ఉప్పునూతల

By Staff
|

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి వ్యక్తం చేశారు. దేవుడు కరుణిస్తే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందేనని ఆయన అన్నారు. ఆదివారంనాడు తన 75వ జన్మదినం జరుపుకున్న ఆయన తనను అభినందించేందుకు వచ్చిన అభిమానులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోగా తెలంగాణ ఏర్పడుతుందన్నారు.

తెలంగాణ అంశాన్ని కొంత మంది స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి సానుభూతి ఉన్నా తెలంగాణ కాంగ్రెసు నాయకుల్లో ఐక్యత లేకపోవడం వల్ల జాప్యం అవుతోందని ఆయన అన్నారు. క్రెడిట్ ఎవరో తామే కొట్టేయాలనే కోరిక చాలా మందికి ఉండడం వల్ల నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. నాలుగేళ్ల నుంచి తాను తెలంగాణ కోసం మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించగలుగుతానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X