• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిఎంకు సిగ్గుండాలి: చంద్రబాబు

By Staff
|

హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి సిగ్గుండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మత్స్యశాఖ ఈఈ అవినీతి వ్యవహారాలపై ముఖ్యమంత్రి తీరును విమర్శిస్తూ ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ వ్యాఖ్య చేశారు. సూర్యనారాయణ అవినీతి బాగోతంపై ముఖ్యమంత్రి ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు. సూర్యనారాయణ అవినీతి వ్యవహారాన్ని చూసి ప్రజానీకం విస్తుపోయిందని ఆయన అన్నారు. అవినీతి ఎంతగా బయటపడినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.

సూర్యనారాయణ ప్రభుత్వ వ్యవస్థలను వాడుకున్న తీరు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. అందులో భాగస్వాములైన ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారు రాజీనామా చేయకపోతే వారిని మంత్రివర్గం నుంచి తప్పించాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రిటైర్డ్ జడ్జితో న్యాయవిచారణకు ఆదేశించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. జలయజ్ఞంలో అవినీతి పెచ్చరిల్లిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X