వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు గోతి కాడి నక్క: మందకృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమ ఓట్ల కోసం గోతి కాడ నక్కలా కాచుకుని కూర్చుకున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నాయకుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల వద్ద విరుచుకుపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్టు చేసి అస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. వర్గీకరణ కోసం 22న తలపెట్టిన రాష్ట్రబంద్‌కు అన్నీ వర్గాల ప్రజలు సహకరించాలని మందకృష్ణ కోరారు. తమ డిమాండ్ ను అంగీకరించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X