• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీడియాపై రమాకాంత్ చిర్రుబుర్రు

By Staff
|

హైదరాబాద్: మీడియాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి చిర్రుబుర్రులాడారు. అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడిన మత్స్యశాఖ ఈఈ సూర్యనారాయణకు తనకూ సంబంధం అంటగడుతూ వార్తలు రాయడంపై ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల వద్ద విరుచుకుపడ్డారు. తాను మీడియాను చూసి పారిపోయినట్లు వార్తలు రాశారని, రమాకాంత్ రెడ్డి పారిపోయేంత పిరికివాడని కానని ఆయన చెప్పారు. తాను పంపిన ఖండనను ప్రచురించకపోవడం న్యాయం కాదని, దీనిపై పరువు నష్టం దావా వేసే హక్కు తనకు ఉందని ఆయన అన్నారు. తాను ఉద్యోగంలోకి రాకముందు నుంచే తనవాళ్లు రాజకీయాల్లో ఉన్నారని, వారిని రాజకీయాలు మానేయాలని చెప్పలేను కదా అని ఆయన అన్నారు.

పత్రిక మాది, మా ఇష్టం వచ్చినట్లు రాస్తామని చెప్పుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. తాను వివరణ ఇస్తే ఆంధ్రజ్యోతి పత్రికవారు బుట్టదాఖలా చేశారని ఆయన అన్నారు. తన వివరణను వక్రీకరించి రాశారని ఆయన విమర్శించారు. సూర్యనారాయణ వ్యవహారంపై న్యాయవిచారణకు ఆదేశించినందున తాను న్యాయవిచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన చెప్పారు. తనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X