హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ కు చెమటలు ఖాయం: రాఘవులు

By Staff
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తమకు ఎన్ని సీట్లు వచ్చినా కాంగ్రెస్ కు చెమటలు పట్టించడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ఈ ఎన్నికల్లో తమకు డబుల్ డిజిట్ (అంటే పదికి పైగా స్ధానాలు) ఖాయమని, కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోవడం తధ్యమని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వామపక్షాలు పోటీచేయాల్సిన సీట్ల వివరాలు, ప్రజాసమస్యలపై చేయాల్సిన పోరాటాల గురించి శనివారం సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు. ఉదయం సీపీఎం, సీపీఐ నాయకులు నగరంలోని సీపీఐ కార్యాలయంలో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో వామపక్షాలు పోటీచేయాల్సిన సీట్ల గురించి చర్చించామన్నారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని... చేతికొచ్చిన పంటలు వర్షానికి తడిసి మద్దతు ధర లభించడం లేదన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి... రైతులకు న్యాయం జరిగేలా పోరాటాలు చేస్తామన్నారు. విద్యుత్తు సమస్యపైపోరాటాలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. వామపక్షాలు వారి తరపున పోరాడుతాయన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X