హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్‌ కంటే నాకే ఆదరణ:చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఎన్టీఆర్‌ కంటే నాకే ఆదరణ మెండుగా ఉందని ఆయన సభలను చూసిన ఉపేంద్రలాంటి వారు చెబుతున్నారు. అలాగే ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఆయన చుట్టూ జనం వచ్చారని... సంస్థాగత నిర్మాణం సైతం అప్పుడే చేసుకున్నారని... అంటున్నారు. అప్పట్లో రామారావు గారికి, జనానికి మధ్య నేరుగా సంబంధం ఉంది. మధ్యలో ఎలాంటి వారధులూ లేవు. అలాగే, నేను కూడా సంస్థాగత నిర్మాణం విషయంలో తొదరపడాల్సిన అవసరం లేదని పెద్దలు చెబుతున్నారు.' అని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ప్రజారాజ్యం ఏడు జిల్లాల కమిటీల సమావేశం సోమవారం శిల్పకళా వేదికలో జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి కాంగ్రెస్‌ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

'మనపార్టీ నిర్వీర్యం అవుతోందని కొంతమంది చెడు ప్రచారం చేస్తున్నారు. పుట్టిన 4నెలల్లో ఈ స్థాయికి చేరుకున్నాం. మనకు రికార్డు బద్దలయ్యేంత విజయం ఖాయం అన్నారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతోందని చిరంజీవి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదే కొనసాగితే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం డొల్లగా మారడం ఖాయమని హెచ్చరించారు.

అదే సమయంలో పార్టీ నేతలకు పలు హెచ్చరికలు చేశారు. 'చిరంజీవి ఛరిష్మా చాలు వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తాం అన్న భ్రమలు ఏమైనా ఉంటే దయచేసి పక్కన పెట్టండి. వచ్చే ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే ఆ తప్పు మీది, నాది అవుతుంది తప్ప ప్రజలది కాదు' అని ఆయన వ్యాఖ్యానించారు.

అభిమానులు సైతం తాను వారికే సొంతం అన్న భావనతో కాక విశాల దృక్పథంతో ఆలోచించి అందరివాడిని చేయాలని సూచించారు. కమిటీలపై నెలకొన్న అసంతృప్తులు త్వరలోనే సమసిపోయానని చెప్పారు. అనంతరం చిరంజీవి నల్గొండ, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌, తూర్పు గోదావరి, కాకినాడ, రాజమండ్రి, కృష్ణా అర్బన్‌, రూరల్‌, నెల్లూరు జిల్లా కమిటీలతో విడివిడిగా సమావేశమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X