వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ నాకు స్పూర్తి: ఒబామా

By Staff
|
Google Oneindia TeluguNews

Barack Obama
వాషింగ్టన్‌: గాంధీ తనకు స్ఫూర్తి ప్రదాత అని ఒబామా చెప్పుకొచ్చారు. ''సామాన్య ప్రజానీకం కలిసికట్టుగా సాగితే అద్భుతాలు సృష్టించవచ్చని గాంధీ నిరూపించారు. ఆయన గొప్పతనం విశ్వవ్యాప్తం. మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నవారెందరో'' అన్నారు. మంగళవారం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే... తన ముందు నిలిచిన అశేష జనవాహినినుద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో భారత్ కు తాము అనుకూలమేనని చెప్పారు. ఆ విషయం ప్రస్దావిస్తూ మేము భారతీయుల వెన్నంటే ఉంటాం. ఉగ్రవాదాన్ని తట్టుకుని నిలబడగల శక్తి భారత ప్రజాస్వామ్యానికి ఉంది. ఆ విషయాన్ని వారు రుజువు చేస్తారు అన్నారు.

అలాగే భారత్‌తో నెరపబోయే సంబంధాలపై స్పందిస్తూ.. ''ప్రపంచంలో పురాతనమైన ప్రజాస్వామ్య దేశం(అమెరికా), ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశం (భారత్‌) సహజ భాగస్వాములు. ప్రాథమిక ప్రజాస్వామ్య విలువలను, ముఖ్యమైన ప్రాధమ్యాలను ఉభయులమూ పంచుకుంటాం.''అన్నారు. ఇక భారత దేశంలో విశేష పూజలందుకునే ఆంజనేయస్వామి ప్రతిమను అదృష్టానికి ప్రతీకగా ఒబామా ధరించడం అందరినీ ఆకట్టుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X