వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా చిన్నారికి ఒబామా అహ్వానం

By Staff
|
Google Oneindia TeluguNews

Pooja Jyothi
చొప్పదండి: ఆమెరికా 44వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒబామా నుంచి కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన పూజజ్యోతి అనే అమ్మాయికి ఆహ్వానం అందింది. ఈ అమ్మాయి తండ్రి,కుటుంబం ఇప్పనపల్లి హరికిషన్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నారు. హరికిషన్ కూతురు పూజజ్యోతి అక్కడి విశ్వవిద్యాలయంలో పదవ తరగతి చదువుతోంది. గతంలో చొప్పదండికి వచ్చిప్పుడు ఇక్కడి పరిస్థితులను గమనించి ఆమె చలించింది. పూజజ్యోతి పెద్దనాన్న ఇప్పనపల్లి సాంబయ్య స్థానిక చేనేత సమస్య లను ఆ చిన్నారికి వివరించారు.

చేనేత కార్మికుల సమస్యలకు పరిష్కార మార్గం లేదా అంటూ ఆమె స్పందించి ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. చేనేత ఆత్మహత్యలకు పరిష్కార మార్గాల అన్వేషించాలంటూ అంటూ ఆమె లక్ష మంది సంతకాలను సేకరించటం ప్రారంభించింది. ఈ సంతకాల ఉద్యమం ద్వారా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనేదే ఆమె ఆలోచన. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి తదితరుల దృష్టిని ఇప్పటికే ఆకర్షించిన ఆమె తాజాగా ఒబామాని ఆకట్టుకని ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానం అందుకోవటం పలువులు ప్రశంసలకు కారణమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X