హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొత్తులపై అధికారం కెసీఅర్ కే

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఎన్నికల్లో పొత్తులను ఖరారు చేసే అధికారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావుకు అప్పగించింది. తెలంగాణాభవన్‌లో ఈరోజు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పొత్తులపై అన్ని పార్టీలు తమతో మాట్లాడాయని, అన్ని అవకాశాలను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రకమిటీ అభిప్రాయపడిందని పార్టీ నేత హరీష్‌రావు తెలిపారు.

అన్ని పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడటం తాము సాధించిన విజయమని అన్నారు. ఎన్ని జరిగినా ఒంటరిపోరుకు సైతం తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామని అన్నారు. అయితే కాంగ్రెస్‌ ఓటమే రాష్ట్రంలో విపక్షాల లక్ష్యం కనుక సీట్ల సంఖ్య, మానిఫెస్టోలపై పూర్తిగా అధ్యయనం చేసి తుది నిర్ణయాన్ని అధ్యక్షుడు తీసుకుంటారని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X