హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం ను కలిసిన అజరుద్దీన్

By Staff
|
Google Oneindia TeluguNews

Mohammed Azharuddin
హైదరాబాద్‌: భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు నిన్నామొన్నా వచ్చిన వార్తలకు బలం చేకూరుస్తూ ఈరోజు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీ, ముఖ్యమంత్రి వైఎస్‌, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌లను అజహరుద్దీన్‌ కలుసుకున్నారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్న వీరిని అజహర్‌ కలుసుకుని మాట్లాడినట్లు సమాచారం. పార్టీలో చేరే విషయాన్ని అజహర్‌ ధృవీకరించాల్సి ఉంది. అజరుద్దీన్ ను కాంగ్రెస్ లో చేర్చుకుని హైదరాబాద్ లోక్ సభ స్ధానం కేటాయిస్తారన్న వదంతి ఉంది. అజర్ కు ఏ సీటు ఇస్తారో ధృవపడకపోయినా ఆయన కాంగ్రెస్ లో చేరేది ఖాయమని నేడు ధృవపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X