హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ పెళ్ళికి హాజరైన చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ల పెళ్ళికి చిరంజీవి హాజరై అక్షింతలు వేశారు. ఇంకా రామ్ చరణ్ తేజ, నాగబాబు, అల్లు అరవింద్ ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్ళి పవన్ కల్యాణ్ జూబిలీహిల్స్ గృహంలో ఆర్య సమాజ పద్ధతిలో నిరాడంబరంగా జరిగింది.

ఈ రోజు ఉదయం పది గంటల 15 నిముషాలకు దండల పెళ్ళి చేసుకున్న అనంతరం పవన్, రేణూలు మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత వివాహాన్ని రిజిస్టర్ చేసుకోడానికి రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ కార్యాలయానికి వెళ్ళారు. గత కొన్నేళ్ళుగా సహజీవనం చేస్తున్నప్పటికీ వీరిద్దరూ అధికారికంగా పెళ్ళి చేసుకోలేదు. కుమారుడు అకిరా పెళ్ళి పెద్దగా వీరి వివాహం నేడు సినిమా ఫక్కీలో జరిగింది.

మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన వెంటనే పవన్ రేణూల వివాహం జరగవలసి ఉంది. అయితే తండ్రి వెంకటరావు మరణించిన ఏడాది తర్వాతే వివాహం చేసుకోవాలని పవన్ నిర్ణయించుకోవడంతో ముహుర్తం నేడు నిర్ణయమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X