హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్, రేణూల పెళ్ళి జరిగింది!

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan-Renu Desai
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల వివాహం నేడు అధికారికంగా జరిగింది. పవన్-రేణూలు గత కొన్నేళ్ళుగా కలిసి జీవించడం, వారికి అకిరా అనే పిల్లాడు పుట్టడం దాదాపు అందరికీ తెలిసిందే. మొదట విశాఖకు చెందిన నందినిని వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ పొసగకపోవడంతో వారు దూరంగా జీవించారు. తనతో హీరోయిన్ గా నటించిన రేణూ దేశాయ్ తో పవన్ గత కొన్నేళ్ళుగా కలిసి ఉంటున్నారు.

నందినికి విడాకులు ఇవ్వడమే కాకుండా, భరణం కూడా చెల్లించిన పవన్ రేణూతోనే ఉంటున్నారు. ఇటీవల ప్రజారాజ్యం యువజన విభాగం అధిపతిగా ప్రజల్లో తిరుగుతున్న పవన్ వైవాహిక జీవితంపై ప్రత్యర్ధి పార్టీల మహిళా నాయకులు విరుచుకు పడుతున్నారు. దీనితో కలత చెందిన పవన్ రేణూతో వివాహాన్ని అధికారికంగా జరిపించుకోవాలని నిర్ణయించారు. జూబిలీహిల్స్ నందగిరి హిల్స్ లోని పవన్ కల్యాణ్ నివాసంలో ఆర్యసమాజ్ పద్ధతిలో ఈ వివాహం నిరాడంరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. పవన్, రేణూల పెళ్ళి శుభలేఖ వారి కుమారుడు అకిరా పేరుతో ముద్రితం కావడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X