హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్‌ కల్యాణ్‌ ఎవరు? కేసీఆర్

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: 'పవన్‌ కల్యాణ్‌ ఎవరు? నేనెప్పుడూ వినలేదే? ప్రాథమికంగా ఆయన గురించి నాకేమీ తెలియదు...అయినా జయశంకర్‌ ఎక్కడ? కల్యాణ్‌ ఎక్కడ? మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి...' అంటూ యువరాజ్యం అధినేత పవన్‌కల్యాణ్‌పై టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం మీడీయా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌ పై విధంగా స్పందించారు.

పవన్ లాంటి వారి వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని,. ఏమైనా అంటే నవ్వి వదిలేస్తామని ఆయన కొట్టి పారేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి టి.హరీశ్‌రావుకు మావోయిస్టుల నుంచి అందినట్టు చెబుతున్న లేఖపై అడిగిన ప్రశ్నకు అది ఉత్త బోగస్‌ అని వ్యాఖ్యానించారు. అసలు తమకు అలాంటి లేఖే రాలేదని చెప్పారు. ఉత్తరం వెనుక ఎవరున్నారన్న అంశాన్ని కూడా తాము ఆలోచించడం లేదన్నారు. మరి ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా.. తాము ఇంకా దీనిపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెదేపాతో పొత్తుపై ఏర్పడ్డ ప్రతిష్టంభన కొనసాగుతోందని వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X