వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి అభ్యర్ధిగా అనిల్ కుంబ్లే?

By Staff
|
Google Oneindia TeluguNews

Anil Kumble
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర బెంగళూరు నియోజకవర్గం నుంచి భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లేను భారతీయ జనతా పార్టీ బరిలోకి దింపే అవకాశాలున్నాయి. ఐతే భాజపా దీనిపై ఇంకా అధికారిక ప్రకటనేదీ చేయలేదు. శుక్రవారం ఈ అంశంపై పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ను విలేఖరులు ప్రశ్నించగా, 'ప్రకటన కోసం వేచి చూడండి' అన్నారు. ఆ స్థానంలో కుంబ్లేను పోటీకి దించాలని స్థానిక నాయకులు సూచించారన్న వార్తలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఉత్తర బెంగళూరు స్థానాన్ని భాజపా కైవసం చేసుకొంది. అక్కడ మాజీ ఐపీఎస్‌ అధికారి హెచ్‌టీ సాంగ్లియానా ఈ పార్టీ తరపున గెలిచారు. నిరుడు యూపీఏ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో మాత్రం ఆయన పాలక పక్షానికి అనుకూలంగా ఓటేసి, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు గురయ్యారు.

రాజ్‌నాథ్‌ పదవీకాలం ఏడాది పొడిగింపు: భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడిగించనున్నారు. నాగపూర్‌లో వచ్చేవారం నిర్వహించనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయాన్ని ప్రకటిస్తారు. రాజ్‌నాథ్‌ పదవీకాలం ఈఏడాది డిసెంబరుతో ముగియనుంది. డిసెంబరులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకుగాను పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఈ వేసవిలో ప్రారంభించాలి. ఇందుకోసం కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం, బ్లాక్‌స్థాయి నుంచి కేంద్రస్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం తదితర సుదీర్ఘమైన ప్రక్రియ నిర్వహించాలి. కానీ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని పార్టీ భావిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X