ఎమ్మెల్సీ ఎన్నికల విజేతలు
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు సోమవారం నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చెందిన దిలీప్‌కుమార్ ఎన్నికయ్యారు. ఆయనను మహా కూటమి బలపరిచింది. ఆయన 22 వేలకు పైగా ఓట్ల మెజారిటీ గెలుపొందారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా యుటిఎఫ్ కు చెందిన కేఎస్ లక్ష్మణరావు గెలుపొందారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ బలపరిచింది. ఆయన తమ సమీప ప్రత్యర్థి అట్లూరి రంగారావుపై 4690 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ప్రతినిధిగా కేవీ సత్యనారాయణ రాజు గెలుపొందారు. ఈయనను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. హైదరాబాదు పట్టభద్రుల నియోజకవర్గంలో కె. నాగేశ్వర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications