వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాంద్ రేప్ చేశాడు: ఫిజా

By Staff
|
Google Oneindia TeluguNews

Fiza-Chand Mohammed
మొహాలీ‌: చాంద్ మొహమ్మద్, ఫిజాల ప్రేమ కథ మరో మలుపు తిరిగింది. హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి చాంద్ పై ఆయన రెండో భార్య ఫిజా పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాంద్ రేప్ చేశాడని, తన మత విశ్వాసాలను కించపరిచాడని, తనను మోసం చేశాడని, తన పరువుకు నష్టం కలిగించాడని ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై మొహాలీ సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ జతీందర్ సింగ్ ఔలాక్ విచారణకు ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఎస్పీ వరీందర్ పాల్ సింగ్ ను ఆయన ఆదేశించారు. తనతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికే చాంద్ ఇస్లాంలోకి మారినట్లు నాటకం ఆడాడని ఫిజా ఆరోపిస్తోంది. చాంద్ మోహన్ నిరుడు డిసెంబర్ లో ఇస్లాంలోకి మారి అనురాధా బాలీ అలియాస్ ఫిజాను పెళ్లి చేసుకున్నాడు. తన పేరును చాంద్ మొహమ్మద్ గా కూడా మార్చుకున్నాడు. దాదాపు రెండున్నర నెలల పాటు ఆమె ఇంట్లో ఉండి ఈ ఏడాది జనవరి 28వ తేదీన వెళ్లిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X