న్యూఢిల్లీ: స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో సంగీతం వాయించి రెండు ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న ఏఆర్ రహ్మాన్ కు పన్ను రాయితీ ఇచ్చే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం చెప్పారు. ఆస్కార్స్ లో నగదు బహుమతి ఉంటే పన్ను రాయితీ ఇవ్వమని ఆర్ధిక మంత్రికి సిఫార్సు చేస్తానని ఆయన తెలిపారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కొత్త భవనం ప్రారంభోత్సవంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తాను కారు ఎక్కబోతుండగా రహ్మాన్ కు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలుసుకున్నానని, ఎంతో ఆనందించానని ఆయన చెప్పారు. ఈ ఉత్సవంలో ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.