లాస్ ఏంజెల్స్: రెహ్మాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చిన సందర్భంలోనే మరో భారతీయ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీల కేటగిరీలో 'స్మైల్ పింకీ' చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక గ్రహణం మొర్రి కారణంగా నవ్వటమే మరిచిపోగా ఓ డాక్టర్ దాన్ని సరిచేసి తిరిగి ఎలా నవ్వేలా చేశారో, అందరి పిల్లలతో తానూ సమానమే అన్నఆత్మవిశ్వాసాన్ని ఎలా కల్పించారో ఇందులో చూపించారు.