చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యాయవాదుల సమ్మెపై కరుణ కలత

By Staff
|
Google Oneindia TeluguNews

Karunanidhi
చెన్నై: తమిళనాడులో న్యాయవాదులకు, పోలీసులకు మధ్య జరుగుతున్న ఘర్షణపై తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కలతచెందారు. ఈ ఘర్షణ అంతం కాకపోతే తాను ఆస్పత్రిలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. "నేను ఆమరణ దీక్ష చేయాలో లేదో అన్నది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది" అని ఆయన ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

చెన్నై పోలీసు కమిషనర్ కె రాధాకృష్ణన్ ఈ గొడవకు సంబంధించిన పత్రాలను సిబీఐకి అప్పగించారు. ఈ ఘర్షణల్లో 200 మంది న్యాయవాదులు అరెస్టయ్యారు. 300 మందిపై కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె జి బాలకృష్ణన్ వినతిని మన్నించకుండా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X