లాస్ ఏంజెల్స్: మన రెహ్మాన్‌కు ఒకటికాదు రెండు ఆస్కార్లు లభించాయి. భారతీయ సంగీతం అంతర్జాతీయ వేదికపైప్రతిధ్వనించింది. ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. బెస్ట్ మ్యూజిక్కు, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్‌కుగాను రెహ్మాన్‌కు రెండు ఆస్కార్లు లభించాయి. అవార్డు లభించగానే హర్షధ్వానాలతో ఆస్కార్ ప్రాంగణం దద్దరిల్లింది.