హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ మీ అడ్డాకెళ్ళి...అరవింద్ విమర్శ

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్: పవన్‌ మీ అడ్డాకెళ్లి మాట్లాడితే తట్టుకోలేక, అక్కసుతో మాట్లాడుతున్నారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవంతో పండిపోయామని చెప్పుకునే రాఘవులు పవన్‌పై చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి అద్దం పడుతున్నాయి అంటూ సిపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చేసిన వ్యాఖ్యలపై ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్‌ వ్యంగ్యంగా స్పందించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ఒక పెద్ద పార్టీకి నేతృత్వం వహిస్తూ ఇంతగా దిగజారి ఎలా మాట్లాడుతున్నారు? సహనం కోల్పోయి మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇలా మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకున్నారు అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి 'ఎక్కడ పడుకున్నావ్..కల్లు త్రాగి తొంగున్నావ్‌' అంటూ రాఘవులు చేసిన వ్యాఖ్యలను అరవింద్ దుయ్యబట్టారు. రాఘవుల వ్యాఖ్యలు వింటుంటే తనకే సిగ్గేస్తోందని దుయ్యబట్టారు. 'సార్‌! ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా స్వేఛ్ఛగా మాట్లాడుకోవచ్చు సార్‌! మీ కూటమి ప్రజల్లోకి వెళ్లలేకపోతోందని, అదే సమయంలో పీఆర్పీ దూసుకెళుతోందని మీకు అసూయ. సిద్ధాంతాల మేరకే మీరు టీడీపీతో చేతులు కలిపారా? మేమైతే వ్యక్తిగత కారణాలతో కలిపారని సందేహిస్తున్నాం అన్నారు. మహా కూటమి'తో సీపీఎం పొత్తు వెనుక అసలు ఎజెండా వెల్లడించడానికి తనకు సంస్కారం అడ్డొస్తోందన్నారు.

అలాగే బషీర్‌బాగ్‌ మృతుల తల్లిదండ్రుల కంటతడికి మీరేం సమాధానం చెబుతారు? బాబుపై మీరు రాసిన పుస్తకాన్ని తిరగరాస్తారా? లేక మేమే మీ పొత్తులపై పుస్తకాన్ని ముద్రించమంటారా? 'నన్ను క్షమించండి...ఆరోజు అబద్ధలు రాశాను' అని చెప్పండి. మీ స్థాయికి, వయస్సుకి, పరిజ్ఞానానికి పొంతన లేకుండా మాట్లాడిన మాటలకు నేను సిగ్గుపడుతున్నాను..అంటూ చెప్పుకొచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X