వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుకి ధీటుగా బాలయ్య పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
నెల్లూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జిల్లా పర్యటనకు ధీటుగా బాలయ్య పర్యటన ఉండాలని టీటీపీ జిల్లా అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటనలో కోరారు. నందమూరి బాలకృష్ణ నెల్లూరు జిల్లా పర్యటన నిర్ణయమైంది. ఈనెల 8 నుంచి నాలుగు రోజుల పాటుఈ పర్యటన కొనసాగుతుంది. బాలకృష్ణ పర్యటన విజయవంతం చేయాలని టీటీపీ జిల్లా అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ విషయమై మంగళవారం జిల్లా టీడీపీ కార్యవర్గ సమావేశం ఎన్‌టీఆర్‌ భవన్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 8 నుంచి 11 వరకు బాలయ్య పర్యటన ఉంటుందని తెలిపారు. ఇక చిరుకి ధీటుగా బాలయ్య పర్యటన ఉండేందుకు..చిరంజీవి పర్యటన ఏయే మార్గాలలో ఉన్నదో అదే మార్గంలో వస్తూ అదనంగా మరికొన్ని ప్రాంతాలను కలుపుతూ పర్యటన మ్యాప్‌ను తయారు చేశారు. ఆ టూరు వివరాలు ఇలా ఉన్నాయి..ఉదయగిరి మీదుగా కావలి వరకు నాలుగు రోజులు పర్యటన సాగుతుంది. నెల్లూరుసిటీ, రూరల్‌ నియోజకవర్గంలో ఒక రోజు పూర్తిగా పర్యటనను ఏర్పాటు చేస్తున్నారు. పర్యటనలో ఆయా నియోజకవర్గ టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్లు బాలయ్య రోడ్‌ షో వాహనంలో ఎక్కాలని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X