వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్‌ చావ్లానే

By Staff
|
Google Oneindia TeluguNews

Navin Chawla
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘ నూతన ప్రధాన అధికారిగా నవీన్‌ చావ్లాను నియ మిస్తూ బుధవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు. ఆయన ఏప్రిల్‌ 21 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం సిఈసిగా ఉన్న గోపాలస్వామి పదవీకాలం ఈ ఏప్రిల్‌ 20తో ముగియనుండడంతో కొత్త సిఈవొగా చావ్లాను నియమిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు చావ్లా ఏప్రిల్‌ 21న బాధ్యతలు స్వీకరిస్తారు.

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ చావ్లాను ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుంచి ఉద్వాసన పలకవలసిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి రాష్ట్రపతికి చేసిన సిఫార్సు పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. గోపాలస్వామి సిఫార్సుపై రాష్ట్రపతి ప్రభుత్వం వివరణ కోరడం జరిగింది. అయితే గోపాల స్వామి ఆరోపణలలో విషయం లేదని, కేవలం బిజెపి వాదనకు అనుకూలంగా మాత్రమే స్వామి వ్యవహరించారంటూ ప్రభుత్వం రాష్ట్రపతికి నివేదించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X