హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుకట్ పల్లి నుంచే జెపి పోటీ

By Staff
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayan
హైదరాబాద్: లోక్ సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ కుకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖరారైంది. శనివారం ఉదయం ఆయన స్వయంగా ఈ విషయాన్ని మీడియా ఎదుట ప్రకటించారు. రాష్ట్ర శాసనసభకు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా ఆ నియోజకవర్గ లోక్‌ సత్తా పార్టీ నేతలు చాలాకాలంగా కోరుతున్నారు. తాను పోటీ చేయాల్సిన అవసరం ఉందనుకుంటే ఎక్కడ నుంచి పోటీ చేసినా ఒకటేనంటూ ఆయన సూత్రప్రాయంగా తన అంగీకారాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 10.30 గంటలకు కేపీహెచ్‌బీ కాలనీలోని ఐమ్యాక్స్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో ఆ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ప్రసంగించిన జెపి తాను కుకట్ పల్లి అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

మరోవైపు పార్లమెంటుకు కూడా పోటీ చేయాలని పార్టీ సీనియర్‌ నేతలు జేపీపై ఒత్తిడి తెస్తున్నారు. మల్కాజ్‌గిరి స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీంతో రెండు చోట్ల నుంచి పోటీ చేసే అంశాన్ని జయప్రకాశ్‌ నారాయణ్‌ తీవ్రంగానే పరిశీలిస్తున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X