వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం బామ్మర్ధిననే...అన్యాయం

By Staff
|
Google Oneindia TeluguNews

P Ravindranath Reddy
కడప: కేవలం సీఎం బావమరిది కావడమే నా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తోంది. టికెట్‌ పొందేందుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ప్రజల మన్ననలు పొందాను. అయినా...వైఎస్‌ బావమరిదినన్న కారణంతో అభ్యర్థిత్వం ఖరారు చేయడంలేదు. పార్టీకి పనితీరే గీటురాయి అన్నప్పుడు బంధుత్వాల ప్రస్తావన అనవసరం. అయితే నా విషయంలో ఆ ఒక్క అంశమే అడ్డంకిగా మారింది అని మీడియా ముందు కడప మేయర్‌ పి.రవీంద్రనాథ రెడ్డి వాపోయారు. కార్పొరేటర్లు, మీడి యా ప్రతినిధుల సమక్షంలో కంటతడిపెట్టారు. ఆయన కడపలోని వైఎస్‌ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు.

52 సంవత్సరాల వయసున్న తాను 32 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా...కడప అసెంబ్లీ సీటు దక్కించుకోలేకపోవడం మనస్తాపానికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి టికెట్‌ కేటాయించని పక్షంలో పార్టీని వీడాల్సి ఉంటుందని...ఈ పరిణామం ఏడుపు తెప్పిస్తోందని కన్నీరు కార్చారు. కడప అసెంబ్లీ స్థానం కేటాయించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. 'అన్నా, బాధపడొద్దు. మేమున్నాం' అని సహచర కార్పొరేటర్లు ధైర్యం చెప్పినా ఆయన కన్నీరు ఆగలేదు. దీంతో సాటి కార్పొరేటర్లు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

తాను, తన సహచర కార్పొరేటర్లు సస్పెన్షన్‌ వేటుకు భయపడే ప్రసక్తే లేదని రవీంద్రనాథ రెడ్డి తెలిపారు. టికెట్‌రాని పక్షంలో రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని కార్పొరేటర్లకు సూచించారు. తాను ఇండిపెండెంట్‌గా ఉన్నా...కడప పార్లమెంటు అభ్యర్థిగా జగన్‌ రంగంలో ఉంటే ఆయన విజయానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఏదైమైనా తొలి అభ్యర్థి పేరునైనా ప్రకటించకముందే కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులువటం ఆలోచించ తగ్గ అంశమే. అందులోనూ ఆ అసమ్మతి సెగ రవీంద్రనాధ్ స్వయానా ముఖ్యమంత్రి వైఎస్‌ బావమరిది వైపు నుంచి రావటం ఏ విధమైన సంకేతాలనిస్తోందనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు..కడప టికెట్‌ రవీంద్రనాథరెడ్డికే ఇవ్వాలంటూ మంగళవారం నుంచి తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం.పి.సురేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X