రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్, అరవింద్, నేనూ పోటీ చేయం

By Staff
|
Google Oneindia TeluguNews

Nagababu
రాజమండ్రి: సామాజిక శంఖారావం పేరుతో ఈనెల 10న నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నాగబాబు, తమ్మినేని సీతారాం రాజమండ్రికి వచ్చారు. నాగబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికల్లో తాను, తమ్ముడు పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌ మేం ముగ్గురూ పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే పార్టీలో చిరంజీవి తర్వాతి స్థానంలో ఉన్న ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్‌ మచిలీపట్నం లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేయవచ్చునని సమాచారం.

కాని కొంతమంది పార్టీ ప్రముఖులు మాత్రం అరవింద్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షించాల్సిన దృష్ట్యా ఎన్నికల బరిలో నిలవటం సరికాదన్న అభిప్రాయమూ ఉండటంతో ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే చిరు సోదరుడు నాగబాబు ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఏదో ఓచోటి నుంచి పోటీ చేసే వీలుందని వినపడుతోంది. పవన్ కళ్యాణ్ జూబ్లిహిల్స్ నుంచి బరిలోకి దిగుతారని బలంగా వినపడుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X