వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు సభ మెగా హిట్

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
రాజమండ్రి: "సామాజిక న్యాయ శంఖారావం" పేరుతో చిరంజీవి మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభ సూపర్ హిట్ అయింది. బడుగు, బలహీన వర్గాల్లో చిరంజీవి ప్రసంగం ఉత్సాహాన్ని నిలిపింది. వెనుకబడిన వర్గాలు పల్లకీ మోసే బోయీల పాత్రను విడిచి ప్రభువులు కావాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పిలుపునిచ్చారు. 14 ఏళ్ల క్రితం ఎన్టీరామారావును గద్దె దింపడంతో రాష్ట్ర ప్రజలకు అరణ్యకాండ మొదలైందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల యుద్ధకాండ ముగిస్తే ప్రజారాజ్యం ఆధ్వర్యంలో మళ్లీ రాజరాజ్యం వస్తుందన్నారు.

ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత గోదావరి జిల్లాల్లో ఇదే ఆ పార్టీ తొలి బహిరంగ సభ. దీనికితోడు చిరంజీవి వస్తుండటంతో నగరం జనసంద్రమైంది. అడుగడుగునా జనం చిరంజీవికి నీరాజనాలు పలికారు.రాజమండ్రితో తనకున్న సినీబంధంతో సరళంగా మొదలైన ఆయన ప్రసంగం ప్రజారాజ్యం ఆవిర్భావానికి కారణాలు, లక్ష్యాలను వివరిస్తూ గంభీరంగా సాగింది.

వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం బడుగు బలహీన వర్గాలకు అత్యధిక సీట్లు కేటాయిస్తుందని చిరంజీవి ప్రకటించారు. రాష్ట్రంలో 30 ఏళ్లనుంచి ఈ వర్గాలను తెదేపా, కాంగ్రెస్‌లు మోసం చేస్తున్నాయని చెప్పారు. ఎనిమిది జిల్లాల్లో అసలు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదని వివరించారు. అసలు వైఎస్‌ కడప జిల్లాలో బలహీనవర్గాలకు ఎన్ని సీట్లిచ్చారు? అని నిలదీశారు. రెండు పార్టీలు ఇంతకాలం వెనుకబడిన వర్గాలను పల్లకీ మోసే బోయీలుగా వాడుకుంటున్నాయని, ఇకనైనా ఏకమై, ప్రభువులుగా మారుదామని ఆవేశంగా పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X