హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి కోపమొచ్చింది

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఎప్పుడూ కూల్ గా ఉండడానికి ప్రయత్నించే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి నిజంగా కోపం వచ్చింది. ఆదివారం రెండు వేర్వేరు సందర్భాల్లో ఆయన తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లు, కో కన్వీనర్ల సమావేశం ఏర్పాటుచేయగా..అది గంటన్నర ఆలస్యమైంది. అప్పటికీ ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడంతో చికాకు చెందిన చిరంజీవి పార్టీ నేతలకు 15 నిముషాల గడువిచ్చి ఆగ్రహంతో వేదిక దిగి వెళ్లిపోయారు. తొలుత ఆయన వచ్చేసరికి అంతా గందరగోళంగా ఉంది. ఆహ్వానితులు, ఆహ్వానేతరులతో హాలు నిండిపోయింది.

మొత్తం రసాభాసగా మారడంతో "మీకు నిన్నే చెప్పాను. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని, జాగ్రత్తలు తీసుకోవాలని. పదేపదే ఇలాగే జరుగుతోంది. 15 నిముషాల్లో మొత్తం సరిచేయండి అంటూ వేదిక దిగి ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత నేతలు హడావుడిగా అందరినీ బయటకు పంపి, సర్దుబాటు చేయడంతో చిరంజీవి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. మరో సందర్భంలో.. టికెట్‌ దక్కలేదని నిరసన తెలిపేందుకు వచ్చిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఆశావహుడు రాజలింగంపై చిరంజీవి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.

అనుచరులతో కలిసి నిరసన తెలపబోయిన ఆయనకు చిరు షాక్‌ ఇచ్చారు. "షో చేశావుగా..మీడియా కవరేజి వచ్చిందిగా... ఇక వెళ్లు!" అంటూ ఆగ్రహించారు. జూబ్లీహిల్స్‌ నుంచి హుమాయూన్‌ను అభ్యర్థిగా రెండురోజుల క్రితం చిరంజీవి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ స్థానంపై ఆశ పెట్టుకున్న సంతోష్‌ యాదవ్‌, రాజలింగం గత రెండు రోజులుగా నిరసనల పర్వానికి తెరతీశారు. పార్టీ కార్యాలయం-1 వద్ద శనివారం తన అనుచరులతో సంతోష్‌ యాదవ్‌ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రాజలింగం తన అనుచరగణంతో కలిసి ఆదివారం పార్టీ కార్యాలయం-2కి వచ్చి చిరంజీవి వాహనానికి అడ్డుగా ధర్నాకు దిగారు. దీంతో ఆగ్రహించిన ఆయన కారు దిగివచ్చి పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆయన వెళ్లిపోయాక సెక్యూరిటీ సిబ్బందికీ, రాజలింగం అనుచరులకు మధ్య పెద్ద గలాటానే జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X