వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపటి నుంచి ఎన్టీఆర్ విశాఖ టూర్

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
విశాఖపట్నం: సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ నెల 17వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు విశాఖ నగరం, జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో నిర్వహించనున్నారు. విజయనగరం పర్యటన పూర్తి చేసుకుని 17వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు కొత్తవలస చేరుకుంటారు. 6.30కి పెందుర్తి, రాత్రి 7.15కి వేపగంట, 7.45కి గోపాలపట్నం, 8.30కి ఎన్‌ ఎడి జంక్షన్‌ల్లో జరిగే రోడ్‌ షోల్లో ప్రసంగిస్తారు. రాత్రి నగరంలోనే బస చేసి 18వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 9.30కి భీమిలిలో రోడ్‌ షోతో ఆ రోజు ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

10.15కి తగరపువలస, 11.15కి మధురువాడ (బోయపాలెం జంక్షన్‌ మీదుగా), మధ్యాహ్నం 12 గంటలకు ఎంవీపీ కాలనీ కూడలికి జూనియర్‌ ఎన్‌ టిఆర్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45కి ఆశీల్‌మెట్ట, 1.15కి జగదాంబ జంక్షన్లలో రోడ్‌ షోలో భాగంగా మాట్లాడతారు. భోజన విరామానంతరం సాయంత్రం నాలుగు గంటలకు కాన్వెంట్‌ జంక్షన్‌ మీదుగా ఐదు గంటలకు కంచరపాలెంలో, ఆరు గంటలకు గాజువాకలో, రాత్రి ఏడు గంటలకు పెదగంట్యాడ, ఎనిమిది గంటలకు కూర్మన్నపాలెం, 8.45కి అగనంపూడిలో ప్రసంగిస్తారు. రాత్రికి బస నగరంలోనే చేస్తారు. 19వ తేదీ ఉదయం 9.30కి బయలుదేరి పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీపాలేనికి 10.30కి చేరుకుని ప్రచారానికి శ్రీకారం చుడతారు.

11.15కి సబ్బవరం, 12.15కి వెంకన్నపాలెం జంక్షన్లలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.15కి చోడవరం చేరుకుంటారు. భోజనం చేసిన తరువాత సాయంత్రం నాలుగు గంటలకు వడ్డాది జంక్షన్‌, ఐదు గంటలకు రావికమతం, ఆరు గంటలకు కొత్తకోట, 6.45కి రోలుగుంట, రాత్రి 7.30కి నర్సీపట్నం సభల్లో మాట్లాడతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 20వ తేదీ నర్సీపట్నం నుంచి పర్యటనను ప్రారంభిస్తారు. 10 గంటలకు మాకవరపాలెం, 11.30కి తాళ్లపాలెం, 12.30కి కశింకోట, 1.15కి అనకాపల్లి చేరుకుంటారు.

భోజనం అనంతరం నాలుగు గంటలకు మునగపాక, సాయంత్రం 5.15కి అచ్యుతాపురం, ఆరు గంటలకు రాంబిల్లి, ఏడు గంటలకు ఎలమంచిలి, రాత్రి ఎనిమిది గంటలకు నక్కపల్లి, తొమ్మిది గంటలకు పాయకరావుపేటల్లో ప్రసంగిస్తారు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ జిల్లా పర్యటన ముగుస్తుందని, జిల్లాలో మొత్తం 120 కిలోమీటర్లు పర్యటిస్తారని టిడిపి జిల్లా అధ్యక్షుడు బండారు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X