వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరుణ్ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ నోటీసు

మేనకాగాంధీ అయిదుసార్లు ఎంపీగా ఎన్నికైన పిలిభిత్ నుంచి ఈసారి వరుణ్ గాంధీ ఎంపీగా పోటీచేస్తున్నారు. తన ప్రచారం సందర్భంగా ఆయన దేశంలోని హిందువులంతా ఒక్కటై నిలవాలని ముస్లింలు అందరినీ పాకిస్థాన్ పంపాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
మహాత్మాగాంధీపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలపై రెండు రోజుల్లో తమకు వివరణ ఇవ్వాలని ఈసీ వరుణ్ గాంధీని ఆదేశించింది.