• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రానున్నది టిడిపి ప్రభుత్వమే: ఎన్టీఆర్

By Staff
|

Jr Ntr
విజయనగరం: వెనకబడిన వర్గాలు పడుతున్న కష్టాలను చూసి వారికి సాయం చేసే ఉద్దేశంతో స్వర్గీయ ఎన్‌.టి.రామారావు సామాజికన్యాయం, తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ప్రజల్లోకి వచ్చి సేవ చేశారని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సామాజికన్యాయం అనేది తెలుగుదేశం పార్టీ లోగో అని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి వస్తున్న ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేనని ఆయన అన్నారు.

ఇతర పార్టీలు అన్ని సీట్లు గెలుచుకుంటాం, ఇన్ని సీట్లు గెలుచుకుంటాం అని లెక్కలు చెపుతున్నాయని టిడిపి గెలుపు లెక్కలకు అందనిదని, అయితే ఖచ్చితంగా ఈ సారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన అన్నారు. నేను రాజకీయ నాయకుడిని కాదని కేవలం కార్యకర్తనేనని పార్టీకి నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నా సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు. రాజకీయాలతో పాటు నా బతుకు తెరువైన సినిమారంగాన్ని కూడా చూసుకుంటానని ఆయన అన్నారు.

తన ప్రసంగాలు బాగున్నాయని అందరూ అంటున్నారని అయితే అందుకు ప్రత్యేకంగా ఏమీ శిక్షణ తీసుకోలేదని గుండెల్లో ఉన్నదే బయటకు వచ్చిందని ఆయన అన్నారు. నా ప్రసంగాలకు మా తాతే నాకు స్ఫూర్తని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు వేయనివాడు రోడ్లు బాగోలేవని, రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని అనే హక్కు లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X