హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు మందకృష్ణ డెడ్ లైన్

By Staff
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: ఎన్నికల పొత్తుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పియస్) నేత మందకృష్ణ మాదిగ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి డెడ్ లైన్ విధించారు. తమతో పొత్తుపై 48 గంటల్లోగా తేల్చాలని, లేదంటే మహాకూటమి తదుపరి పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు మహాకూటమి నేతల ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తామని, ఈలోగా ప్రతిస్పందించకపోతే తాము అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

మహాకూటమి తమతో పొత్తుకు సిద్ధపడకపోతే ఎన్నికలను బహిష్కరించాలా, 42 లోకసభ స్థానాల్లో, 294 శాసనసభా నియోజకవర్గాల్లో పోటీ చేయాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. మహా కూటమితో తమకు పొత్తు కుదరకపోతే బిజెపితో గానీ, ప్రజారాజ్యం పార్టీతో గానీ పొత్తు పెట్టుకోబోమని ఆయన చెప్పారు. మహాకూటమి భాగస్వామ్య పార్టీలైన సిపిఐ, సిపిఎంలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులుపై ఆయన విమర్శలు చేశారు. రాఘవులు మార్క్సిస్టు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణపై కూడా ఆయన విమర్శలు చేశారు. మందకృష్ణ మాదిగ నాలుగు లోకసభ స్థానాలను, 30 అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని మహా కూటమిని అడుగుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X