హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్యకు బావ దగ్గుబాటి లేఖ

By Staff
|
Google Oneindia TeluguNews

Daggubati Venkateswara Rao
హైదరాబాద్‌: '1995 ఆగస్టులో ఏ మాట చెప్పి వైస్రాయ్‌ హోటల్‌కు తెచ్చారో ఇప్పుడు మళ్లీ అలాంటి మాటలే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీతో మాట్లాడిస్తున్నారు. అప్పట్లో అవసరం తీరాక చంద్రబాబు ఎలా ప్రవర్తించారో గుర్తుండే ఉంటుంది' అని సినీనటుడు బాలకృష్ణను ఉద్దేశించి ఆయన బావ, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన బాలయ్యకు రాసిన లేఖను ఆయన బుధవారం పత్రికలకు విడుదల చేశారు. కారంచేడులో బాలకృష్ణ చేసిన విమర్శల నేపథ్యంలో ఉత్తరాన్ని బహిర్గతం చేస్తున్నట్లు తెలిపారు.

చిన్నమ్మ(పురంధేశ్వరి) మంచి పేరు తెచ్చుకున్నారని బాలయ్య కితాబు ఇచ్చినందుకు సంతోషమని తెలిపారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా చిన్నమ్మ ప్రతిభకు ప్రధాని మన్మోహన్‌, కాంగ్రెస్‌ అధినేత సోనియా సముచిత స్థానం ఇచ్చారని అన్నారు. అవినీతి అంటూ గోలపెడుతున్న చంద్రబాబుకు ఆస్తిపాస్తులు ఎలా వచ్చాయో అందరికీ తెలుసని అన్నారు. 'చిన్నమ్మకు నీవన్నా, హరి అన్నా, మిగతా కుటుంబసభ్యులన్నా ఎంత ప్రేమో మీకు తెలియంది కాదు. ఒంటరిదై బయటకు వచ్చినపుడు ఏ విధమైన మానసికక్షోభ అనుభవించామో మీకు అర్థం కాదు' అని ఆయన అన్నారు. 'తనపై పోటీ చేస్తానంటే తమ్ముడిని ఆశీర్వదిస్తానన్న గొప్ప సంస్కారి ఆమె' అని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X