వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్తపల్లిని ఆహ్వానించాం: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
గుడివాడ: తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని తమ పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనని, తుది నిర్ణయం కొత్తపల్లి సుబ్బారాయుడిదేనని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెప్పారు. కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న ఆయన గురువారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ పార్టీ విజయభేరీ తర్వాత రాష్ట్రంలోని 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 22వ తేదీన ప్రజారాజ్యం ఈ తొలి జాబితాను వెలువరించే అవకాశం ఉంది.

డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ పై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్య సబబే అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు ఉపయోగపడే అధికారుల కన్నా ఎక్కువగా అధికారులను తమ ప్రయోజనాలకు వాడుకునే రాజకీయ నేతల వైఖరిని వ్యతిరేకించాల్సి ఉందని ఆయన అన్నారు. తన పర్యటనల సందర్భంగా మహిళలకు అసౌకర్యం కలిగితే తగిన విధంగా స్పందిస్తానని ఆయన చెప్పారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే వారిని తమ పార్టీ కార్యకర్తలు సహించరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X