హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'బాలయ్య పదిసార్లు తొడ కొడ్తారు'

By Staff
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
హైదరాబాద్: సినీ నటుడు బాలకృష్ణ ఒక్కసారి కాదు పదిసార్లు కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఇంటి ముందు తొడ కొడతారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి అన్నారు. తన ఇంటి ముందు బాలకృష్ణ తొడకొట్టడంపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పిన అభ్యంతరానికి ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా ప్రతిస్పందించారు. అవాకులు చెవాకులు పేలితే దగ్గుబాటి వెంకటేశ్వర రావు జాతకాన్ని బయట పెడతానని ఆమె అన్నారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు జీవితం గుట్టు విప్పితే ప్రజలు అసహ్యించుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సమీపంలోని గచ్చిబౌలిలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు స్థలాన్ని ఆక్రమించుకుని ఎంతో మంది ఉసురు పోసుకున్నారని ఆమె అన్నారు. కారంచేడు దురాగతానికి దగ్గుబాటి కుటుంబమే కారణమని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X