ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నర్సాపురం నుంచి కూడా చిరు పోటీ?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ఏలూరు: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తిరుపతి తర్వాత సొంత నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచే పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఆయన సొంతూరు మొగల్తూరు ఈ నియోజకవర్గంలోనే ఉంది. సొంత గ్రామానికి ఏమీ చేయలేదని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నందున, పాలకొల్లు నుంచి పోటీ చేస్తే అవే విమర్శలు పునరావృతమయ్యే అవకాశం ఉందని పార్టీ జిల్లా నేతలు అభిప్రాయంగా తెలిపారని తెలిసింది. చిరంజీవి నరసాపురం నుంచి పోటీ చేస్తే, కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ సారి పోటీకి పాలకొల్లును ఎంపిక చేసుకునే వీలుందని ప్రజారాజ్యం నాయకుడొకరు వెల్లడించారు.

కొత్తపల్లి సుబ్బారాయుడిని నరసాపురం లోక్‌ సభ స్థానం నుంచి నిలబెట్టాలని పార్టీ ప్రతిపాదించగా అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అసెంబ్లీకే పోటీ చేస్తానని తన అభిప్రాయాన్ని తెలిపారని తెలిసింది. నరసాపురం లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఎమ్మెల్సీ కనుమూరి బాపిరాజును తమ అభ్యర్థిగా ప్రకటించినందున, అదే కులానికి చెందిన వ్యక్తికే అభ్యర్థిత్వం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కృష్ణంరాజు ప్రజారాజ్యం పార్టీలో ఇంకా చేరలేదు. ఆయన టిడిపిలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X