వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు మార్పుపై ఎన్టీఆర్ విసుర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
రామచంద్రాపురం: మాటల మార్పు మనకు వద్దని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి నినాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన పర్యటన సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది. మార్పు తెస్తామని కొందరు రాజకీయాల్లోకి వచ్చారని, వారి మాటలు నమ్మడానికి వీలు లేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, గెలిపించి తీరుతారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటినవారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడని ఆయన చెప్పారు. చంద్రబాబునాయుడిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ఐటికి ప్రాధాన్యం ఇచ్చి యువతకు ఉపాధి కల్పించడంలో అది ప్రధాన పాత్ర పోషించిందని ఆయన అన్నారు.

రాష్ట్రం కాంగ్రెస్ అవినీతి కోరల్లో చిక్కుకుపోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు అవినీతిని విచారించడానికి ఈ కోర్టులు సరిపోవని, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. పాలిచ్చే ఆవు తెలుగుదేశం పార్టీని కాదని, కుళ్ల బొడిచే ఆంబోతును గెలిపించారని ఆయన అన్నారు. పేదలను, మధ్యతరగతి ప్రజలను, రైతులను ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన వాగ్దానాలను ఆయన ప్రస్తావించారు. వరాలిస్తే ప్రజలు సోమరిపోతులవుతారని కాంగ్రెసు వారంటున్నారని, కాంగ్రెసు నాయకులే సోమరిపోతులవుతున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X