హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: సీట్ల కేటాయింపులు, సర్దుబాట్ల విషయాల్లో తెలుగుదేశం పార్టీలో నిరసనల వెల్లువ పెల్లుబుకుతోంది. కొన్ని నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం సీటును శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కొంత మంది కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని బెదిరిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీట్ల సర్దుబాటులో తమ పార్టీకి బలం ఉన్న సీట్లు కూడా మిత్రపక్షాలకు వెళ్లడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తోంది. టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీకి క్యాడర్ ఉందని, పునాది ఉందని, పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను మిత్రపక్షాలకు కట్టబెట్టడం వల్ల పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని వాదిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో సీట్ల సర్దుబాటు పార్టీకి కష్టాలు తెచ్చే పెట్టే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X