చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతి కాంగ్రెసుకు బుద్ధి: బాలయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
చిత్తూరు: అవినీతి కాంగ్రెసును గద్దె దింపాలని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. ఆయన బుధవారం నాడు కూడా చిత్తూరు జిల్లాలో పర్యటించారు. మదనపల్లి తదితర ప్రాంతాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన నగదు బదిలీ పథకం వల్ల పేదలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే కలర్ టీవీల వల్ల పేదలు స్వాంత్వన పొందవచ్చునని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ స్వచ్ఛమైన పాలనను అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X