• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వరుణ్ గాంధీకి ప్రాణభయం

By Staff
|

Varun Gandhi
న్యూఢిల్లీ: భాజపా నేత వరుణ్‌ గాంధీని పోలీసులు పిలిభిత్‌ జైలునుంచి తరలించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు క్రిమినల్‌ కేసు దాఖలైనందు వల్ల కోర్టు ఆయనకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఆయనపై నాసా కింద కేసు పెట్టాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా నిర్ణయించటంతో అందుకు నిరసనగా వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌ సంస్థలు ఈరోజు పిలిభిత్‌లో బంద్‌కు పిలుపునిచ్చాయి.

దీంతో ముందు జాగ్రత్తగా వరుణ్‌ను అరోజు ఉదయం అక్కడినుంచి తరలించి ఈటా జైలులో ఉంచారు. వరుణ్ గాంధీని హతమారుస్తామని మాఫియా నాయకుల నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్టు తెలిసింది. చోటా షకీల్ వరుణ్ హత్యకు కుట్ర పన్నినట్టు ఇంటిలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X