హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రచారానికి జూ. ఎన్టీఆర్ రెడీ

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 15 లేదా 16వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఐదారు రోజుల పాటు 8 జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. అయితే ఈసారి రోడ్ షోలు ఉండవు. బహిరంగసభల్లో కూర్చుని మాట్లాడుతారు. ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4, రాత్రి 7 గంటలకు సభలుంటాయి. రోజుకు మూడు చోట్ల ఆయన ప్రసంగిస్తారు.రెండో దశ పోలింగ్ జరిగే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. హెలికాప్టర్ లో ఆయన ప్రయాణం చేస్తారు.

ఎన్టీఆర్ తల వెనుక, కుడి భుజం వెనుక అయిన గాయాలు కొంత మేరకు నయమయ్యాయి.ఈ నెల 12వ తేదీన ఆయన డిశ్చార్జీ అయ్యే అవకాశం ఉంది. కనుబొమ వద్ద చర్మం లేకపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత రెండు నుంచి మూడు వారాల పాటు ఎండలోకి వెళ్లకూడదు. అలా వెళ్తే చర్మం ముడుతలు పడే ప్రమాదం ఉంటుంది.పక్కెటముకలు రాపిడికి గురి కావడంతో గాలి పీల్చినప్పుడు కొంత తల నొప్పి కలుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X