హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరకాల రాజీనామా మామూలే: ఉపేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

Upendra
హైదరాబాద్: పరకాల ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేయడం సాధారణమేనని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు పర్వతనేని ఉపేంద్ర అన్నారు. తమ పార్టీ అధినేత చిరంజీవిపై ప్రజలకు ఉన్న అభిమానమే పార్టీని గెలిపిస్తుందని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలోనే పార్టీపై పరకాల ప్రభాకర్ విమర్శనాస్త్రాలు గుప్పించిన అనంతరం ఉపేంద్ర మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. చిరు సభకు లక్షలాదిగా ప్రజలు వస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ ప్రభావం తగ్గుతుందనే మీడియా ప్రచారంలో నిజం లేదని ఆయన అంటూ చిరంజీవి సభకు వచ్చే ప్రజల సంఖ్య తగ్గిందా అని అడిగారు.

చిరంజీవితో దశాబ్దాలుగా ఉన్న ఆయన అభిమానులకు కూడా టిక్కెట్లు రాలేదని, వారు చిరుకు విధేయంగానే ఉంటారని ఉపేంద్ర చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ కొత్తగా ఏర్పడిందని, రాష్ట్రంలో ఉన్నవి 294 స్థానాలేనని, వాటిని అందరికీ పంచడం సాధ్యం కాదని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన పార్టీ కాబట్టి ఎలా వెళ్లాలో తెలియకపోవచ్చునని, కొన్ని పద్ధతులు పాటించి ఉండకపోవచ్చునని, కానీ అంత మాత్రాన పార్టీలో ఎవరినో శంకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

పార్టీ విషవృక్షమని పరకాల చేసిన వ్యాఖ్యను ప్రస్తావించగా అది తెలుసుకోవడానికి ఏడాది పట్టిందా అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. విజ్ఞులై వుంటే ఎన్నికల తర్వాత రాజీనామా చేసి ఉండేవారని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడం రాజకీయాల్లో సాధారణమని ఆయన అన్నారు. చిరంజీవి ఆకర్షణ మీద ఆధారపడిన పార్టీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X