వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని ఆలోచన లేదు: రాహుల్

By Staff
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
కొచ్చి: తనకు ప్రధాని కావాలనే ఆలోచన లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు రాహుల్ ప్రధాని అవుతారనే తన సోదరి ప్రియాంకా గాంధీ వ్యాఖ్యపై ఆయన ప్రతిస్పందించారు. తాను ఎన్నో ప్రాథమికావసరాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఆయన సోమవారం కేరళలో కాంగ్రెసు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు వారసత్వ రాజకీయాలపై నమ్మకం లేదని ఆయన చెప్పారు. తన సోదరి ప్రియాంక రాజకీయాల్లోకి వస్తే సంతోషిస్తానని ఆయన చెప్పారు.

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆయన యువకుడిగా అభివర్ణించారు.భవిష్యత్తు దృష్టి మన్మోహన్ సింగ్ కు ఉందని ఆయన చెప్పారు. తమ ప్రత్యర్థికి ముందు చూపు లేదని, గతంలోనే ఉండిపోతారని ఆయన పేరెత్తకుండా బిజెపి ప్రధాని అభ్యర్థి ఎల్ కె అద్వానీపై వ్యాఖ్యానించారు. యువకుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడని, వృద్ధులు గతం గురించి ఆలోచిస్తారని, మన ప్రధానికి ముందు చూపు ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X