వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ లాయర్ గా అబ్బాస్ కజ్మీ

By Staff
|
Google Oneindia TeluguNews

Abbas Kazmi
ముంబయి: ముంబయి దాడుల నిందితుడు మొహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ న్యాయవాదిగా అబ్బాస్ కజ్మీని కోర్టు నియమించింది. వృత్తిపరమైన నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణపై అంజలి వాగ్మారేను తొలగించిన విషయం తెలిసిందే. న్యాయవాద వృత్తిలో కజ్మీకి మంచి పేరుంది. ఆయన ప్రైవేట్ లాయర్. ఆయన నిందితుడిని కలిశారు. పాకిస్తాన్ న్యాయవాదిని తన తరఫున నియమించాలని కసబ్ ప్రత్యేక న్యాయమూర్తి ఎంఎల్ తహిలియాన్ ను కోరారు. తాము పాకిస్తాన్ అధికారులకు లేఖ రాసినట్లు న్యాయమూర్తి చెప్పారు. అయితే అక్కడి నుంచి ఏ విధమైన సమాధానం లేదని ఆయన చెప్పారు. అయితే మరోసారి ప్రయత్నించాల్సిందిగా కసబ్ న్యాయమూర్తిని కోరారు.

కసబ్ గ్రే టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ ధరించాడు. కసబ్ కు న్యాయవాదిని ఇవ్వాలని తాము దౌత్యపరంగా చేసిన విజ్ఞప్తికి పాకిస్తాన్ నుంచి ఏ విధమైన సమాధానం రాలేదని న్యాయమూర్తి చెప్పినప్పుడు బహుశా వారు న్యాయవాదిని ఇవ్వకపోవచ్చునని కసబ్ అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X