హైదరాబాద్: హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గంలోని జూబిలీహిల్స్ లోని ఒక పోలింగ్ బూత్ లో ప్రముఖ సినీ నటుడు నాగార్జున, తన భార్య అమల, కుమారుడు నాగ చైతన్య కలిసి వచ్చి గురువారం ఉదయం ఓటు వేశారు. మరో ప్రముఖ సినీ నటుడు వెంకటేష్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో తొలి రెండు గంటల పాటు సామాన్యులు పెద్దగా తమ ఓటు వేయడానికి రాలేదు.
ప్రముఖ నిర్మాత రామానాయుడు, దర్శకుడు రాఘవేంద్ర రావు ఓటు వేశారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పదిన్నర గంటల తర్వాత భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజా కలిసి ఓటు వేసే అవకాశం ఉంది. చిరంజీవి నెల్లూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కూడా ఈ నియోజకవర్గంలోనే ఓటు వేయాల్సి ఉంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి