వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్య రోడ్ షోలో లాఠీచార్జీ

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
గుంటూరు: గుంటూరులో బాలకృష్ణ పర్యటన సందర్భంగా పోలీసులు లాఠీఛార్జి చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగింది. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం బాలకృష్ణ పర్యటించారు. అక్కడ ఆలస్యం కావటంతో గుంటూరు చేరేసరికి రాత్రి అయింది. దీంతో ఆయన ప్రసంగాలు చేయకుండా చేతులు మాత్రం వూపారు.

అయితే కార్యకర్తలు, అభిమానులు బాలకృష్ణ మాట్లాడాల్సిందేనని పట్టుబట్టారు. బాలయ్య వాహనానికి అడ్డం తిరిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు అక్కడున్న వారిపై లాఠీఛార్జి చేశారు. దాంతో అభిమానులు, కార్యకర్తలు పరారయ్యారు. ఆఖరుకు ద్విచక్రవాహనాలపై ఇళ్లకు వెళుతున్న వారిపై కూడా పోలీసులు వదలలేదు.దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X