లక్నో: ప్రజలను ఆకట్టుకోనేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై మున్నాభాయ్ చిత్రంలోని చిలిపి డైలాగ్‌ను ఉపయోగించిన సమాజ్‌వాది పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీనటుడు సంజయ్ దత్ కష్టాల్లో పడ్డారు. శుక్రవారం ప్రతాప్ గఢ్ ఎన్నికల ప్రచారంలో సంజయ్ దత్ మాట్లాడుతూ తన మున్నాభాయ్ చిత్రంలోని పాపులర్ అయిన "జాదూకి జప్పీ, పప్పీ" అనే డైలాగ్‌ను మాయావతిని ఉద్దేశించి అన్నారు. "మాయావతిని హత్తుకొని... ఓ ముద్దిస్తాను. ఆమె పాలనలో కుళాయిలు ఉన్నాయిగానీ అందులోంచి నీళ్లు రావు, బల్బులు ఉన్నాయి కాని కరెంట్ రాదు...ఆసుపత్రిలు ఉన్నాయి గానీ అందులో పడకలు లేవు" అని సంజయ్‌దత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ప్రతాపగఢ్ జిల్లా కలెక్టర్ సంజయ్ కు శనివారం నోటీసులు జారీ చేశారు.