బీహార్ లో నక్సల్స్ హింసాకాండ
రాంచి: మలివిడత ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన మావోయిస్టులు బుధవారం బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఉదయం నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో మావోయిస్టుల విధ్వంసం కొనసాగుతోంది. జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఓ రైలును హైజాక్ చేసిన మావోయిస్టులు ఉంటైర్ రైల్వేస్టేషన్ ను బుధవారం ఉదయం పేల్చివేశారు.
బీహార్‌లోని గయలో ఎప్పుడూ రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ రోడ్డులో 9 ట్రక్కులను దహనం చేశారు. ట్రక్ తో పారిపోయేందుకు యత్నించిన ఓ డ్రైవర్‌ను కాల్చిచంపారు. ఔరంగాబాద్ లోబ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసును పేల్చివేశారు.












Click it and Unblock the Notifications